మెగాస్టార్‌తో పోటీ పడనున్న ‘డిజే టిల్లూ’
‘డిజే టిల్లూ-2’ సినిమాతో రాబోతున్న సిద్దూ జొన్నలగడ్డ చిత్రం, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ సినిమాతో పాటు ఒకేరోజున రిలీజ్ కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ముందుగానే ప్రకటించింది. సూపర్ స్టార్ మహేశ్ నటిస్తున్న చిత్రాన్ని కూడా అదేరోజున రిలీజ్ చేస్తామని సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. కానీ ఆచిత్రం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో పోటీ నుండి వైదొలగింది. ఇప్పుడు డిజే టిల్లు -2 ను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనితో మెగాస్టార్ చిత్రంతో మూవీ రేస్‌లో నిలవబోతోంది ఈ చిత్రం.

