ఈ దీపావళికి నీటి దీపాలు వెలిగిద్దామా..
మనసర్కార్
దీపావళి వస్తోందంటే చాలు చిన్న,పెద్ద అంతా చాలా హడావుడిగా షాపింగ్‌లో పడిపోతుంటారు. చిన్నపిల్లలు బాణాసంచా కొనుగోలులో బిజీగా ఉంటే పెద్దవారు దుస్తులు, ప్రమిదల కొనుగోలులో బిజీగా ఉంటారు. జీవితంలో నూతన కాంతులు ప్రసరించాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటూ దీపావళి రోజు ప్రమిదలు, కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటాం. ఈ ఆధునిక కాలంలో కాస్త మోడ్రన్‌గా విద్యుత్ దీపాలు, ఎల్ఈడీ వెలుగుల తోరణాలు కూడా అలంకరిస్తుంటారు కొందరు.
ఇప్పుడు నూనె ఖర్చు లేకుండా నీటితో కూడా వెలిగే దీపాలు వస్తున్నాయి. షిరిడీ సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారని వినే ఉంటాం. అయితే అంత శక్తి మనకు లేదు కానీ, నీరు పోస్తే ప్రమిదల్లాంటి ప్లాస్టిక్ దీపాల్లో చిన్న బల్బుల లాంటి దీపాలు బ్యాటరీ సహాయంతో వెలుగుతాయి. నీరు తీసేయగానే దీపం ఆగిపోతుంది. బ్యాటరీ వేస్తే దాదాపు 48 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుందట. ఈ దీపావళికి మనమూ నీటి దీపాలు ప్రయత్నిద్దామా..

