మంటల్లో దివాకర్ ట్రావెల్ బస్సు
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ బస్సు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందింది. మొత్తం నాలుగు దివాకర్ బస్సులను అక్కడ నిలిపి ఉంచగా.. వీటిలో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరొకటి పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Breaking news: కాల్పులతో వణికిపోతున్న అగ్రరాజ్యం..