Home Page SliderNational

విడాకులు తీసుకున్నంత మాత్రాన దురదృష్టవంతురాలిని కాదు..

తాను విడాకులు తీసుకున్నంత మాత్రాన దురదృష్టవంతురాలిని కాదని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కామెంటర్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనను కాదని, వేరొక వివాహం చేసుకుంటే అది తన తప్పా అని ప్రశ్నించారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన వార్తలు పోస్టు చేస్తూ ఉంటారు. ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలవడంతో పాటు, డిప్యూటీ సీఎం కావడం మంత్రి పదవులు చేపట్టడంతో మళ్లీ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఒక వ్యక్తి మీరు చాలా దురదృష్టవంతులు మేడం అంటూ కామెంట్ పెట్టడంతో ఆమె మండిపడ్డారు. తాను ఎవరి వల్లో అదృష్టవంతురాలు కానీ, దురదృష్టానికి కానీ లోను కానని, తన శక్తిసామర్థాలు తనకున్నాయని తేల్చి చెప్పారు. మనం 2024లో ఉన్నా కూడా చనిపోయిన, లేదా విడిపోయిన భాగస్వాముల గురించి పోల్చి చెప్పడం మనుషులలో మారలేదని, ఈ పద్దతిని మార్చుకోవాలని హితవు చెప్పారు. మైండ్ సెట్ మార్చుకోమంటూ సలహా ఇచ్చారు. ఆమెకు మద్దతుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు.