మిస్ దివా యూనివర్స్ కిరిటం దివితా రాయ్ కైవసం..
71 వ మిస్ యూనివర్స్ 2022 పోటీలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయ్. ఈ పోటీలో దివితా రాయ్ లివా మిస్ దివా యూనివర్స్‌గా గెలిచి కిరీటాన్ని అందుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించిన దివితా రాయ్ మిస్ దివా యూనివర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెకు కిరీటాన్ని బహుకరించడానికి 2021 70వ మిస్ యూనివర్స్‌గా కిరీటాన్ని అందుకున్న హర్నాజ్ సంధు చేతులు మీదుగా అందించారు. 71వ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న దివితా రాయ్ ముంబైకి చెందినవారు.

దివితా రాయ్ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించారు. దివితా వృతిరీత్యా మోడలింగ్, ఆర్కిటెక్ట్ గా కూడా చేశారు. కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ముంబైలో చదువుకున్నారు. అదే సమయంలో మోడలింగ్‌పై ఇష్టంతో ఈ వృత్తిలోకి వచ్చారు. గత సవంత్సరం హర్నాజ్ కిరీటాన్ని గెలుచుకోగా దివితా రన్నరప్‌గా నిలిచారు. ఈ సంవత్సరం ఆమె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.