గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కరెక్టేనన్న హైకోర్టు డివిజన్ బెంచ్
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీకి హైకోర్టులో చుక్కుదురైంది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ నిర్ణయం సమర్థనీయమంది. గ్రూప్ 1 పరీక్ష ఇష్టారాజ్యంగా నిర్వహించారని, కనీసం బయోమెట్రిక్ వివరాలు సైతం తీసుకోలేదంటూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పరీక్ష మరోసారి నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ టీఎస్పీఎస్సీని ఆదేశించారు. తాజాగా డివిజన్ బెంచ్ సైతం అదే తీర్పు వెలువరించింది.

