మునుగోడులో టీఆర్ఎస్ డబ్బుల పంపిణీ..
మునుగోడులో టీఆర్ఎస్ డబ్బుల పంపిణీ యధేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు సొంత వాహనాల్లో నోట్ల కట్టలు, పార్టీ జెండాలతో తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరుల వాహనాల్లో డబ్బులున్నట్టు గుర్తించారు. నోట్ల కట్టలతోపాటు, టీఆర్ఎస్ జెండాలు సైతం ఉన్నాయి. నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఫిర్యాదులు అందుతున్నాయి. కార్లలోనే నోట్ల కట్టలను కన్పించాయి. చండూరు, మర్రిగూడెం మండలాల్లో ఉద్రిక్తత నెలకొంది. మునుగోడులో డబ్బుల పంపిణీపై సీఈవోకి 60కి పైగా ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.


