రేపటి నుండి స్కూల్ చిన్నారులకు పుష్టినిచ్చే ‘రాగిజావ’ పంపిణీ
ఏపీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు రేపటినుండి రాగిజావ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. వేసవి తాపం మొదలయ్యే ఈ కాలంలో రాగిపిండి జావ ఎంతో చలువ చేస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. త్వరగా అలిసిపోకుండా,నిస్సత్తువ రాకుండా చేసే గుణం రాగి జావలో ఉంది. రాగిలో పిల్లల శరీరానికి పోషణనిచ్చే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తుంది. సరైన ఉపాహారం తీసుకోకపోయినా, రాగి గంజి నీరసం రాకుండా కాపాడుతుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఈ పథకం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజుల పాటు రాగిజావ, మరో మూడురోజులు పల్లీ చిక్కీ అందిస్తారు. విద్యార్థులు వారి గ్లాసులు ఇళ్ల నుండి తెచ్చుకోమని తెలియజేసారు. ఈ రాగిజావకు అవసరమైన రాగిపిండి, బెల్లాన్ని సత్యసాయి ట్రస్ట్ ఉచితంగా అందిస్తోంది.

