Home Page SliderNational

బీహార్‌లో అమ్మాయిలకు కత్తుల పంపిణీ

బిహార్‌లో సీతామర్హి ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ చేసిన పని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన విద్యార్థినులకు కత్తుల పంపిణీ చేశారు. వారిని ఎవరైనా తాకితే చేతులు నరికేయాలంటూ పిలుపునిచ్చారు. అమ్మాయిలు శక్తి స్వరూపిణులని, వారిని అసభ్యంగా తాకాలంటే ఎవరైనా భయపడాలని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రులలో ఆయుధ పూజ సందర్భంగా కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలకు కూడా పూజలు చేసి, కత్తులు పంపిణీ చేశారు. దీనికి ప్రజలు కూడా మద్దతు తెలిపాలని కోరారు.