తెలంగాణాలో ఆగస్టు 15 నుంచి ఇళ్ల పంపిణీ:మంత్రి కేటీఆర్
తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలంగాణా ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. అదేంటంటే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయని కేటీఆర్ తెలిపారు. కాగా ఈ ఇళ్లను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో గృహలక్ష్మి పథకం ప్రారంభం కానుందన్నారు. దీంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 40వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అయితే నగరంలో కొత్తగా 314 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. ఈ మేరకు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.