ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట చర్చిల వద్ద కేకుల పంపిణీ
క్రీస్మస్ పర్వదినం సందర్భంగా దేశమంతటా క్రైస్తవులు సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. రాత్రి నుంచి క్రైస్తవులు ప్రార్థన మందిరాలకు చేరుకొని ఉత్సాహంగా క్రీస్తు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా, ప్రముఖ ఆరా ఫౌండేషన్ సంస్థ చిలకలూరిపేట పట్టణంలోని అన్ని క్రైస్తవ ప్రార్ధన మందిరాలకు కేకులను పంపిణీ చేసింది. సంస్థ సిబ్బంది చిలకలూరిపేట పట్టణంలోని చర్చిలకు వెళ్లి… ఆదివారం మధ్యాహ్నం సమయానికే కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల ఫాదర్లు ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ ను అభినందించారు. ఆరా మస్తాన్ మానవతావాది అని కొనియాడారు.

ఓవైపు చర్చల్లో కేకులు పంపిణీ చేసిన ఆరా ఫౌండేషన్ సిబ్బంది, పట్టణంలోని పోలీసులు అందరికీ నూతన వస్త్రాలను బహుకరించారు. సందర్భంగా ఆరా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను పోలీసులు మెచ్చుకున్నారు. సర్వే రంగంలో తెలుగు రాష్ట్రాల్లోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న షేక్ మస్తాన్, పేదలు బడుగు బలహీన వర్గాలకు అపన్న హస్తం అందించడం ఎంతో గొప్ప విషయం అంటూ వారు కితాబిచ్చారు. ఆరా ఫౌండేషన్ గత ఏడాది కూడా చిలకలూరిపేట పట్టణంలో పెద్ద ఎత్తున చర్చిల వద్ద కేకులు పంపిణీ చేయడంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించింది. ఈ ఏడాది సైతం చర్చిల వద్దకు ఆరా ఫౌండేషన్ సిబ్బంది వెళ్లి కేకులను అందించారు. ఈ సందర్భంగా, ఆరా ఫౌండేషన్, చేపడుతున్న కార్యక్రమాలను వివిధ వర్గాల ప్రజలు అభినందించారు.