కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణాలో 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ
ఇచ్చినమాట నిలబెట్టుకున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ. 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కొల్లూరులో గేటెడ్ కమ్యూనిటీ లెవెల్లో సకల సౌకర్యాలతో కట్టించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు అసెంబ్లీ నియోజక వర్గ పరిధి రామచంద్రపురం మండలం కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్దదైన టౌన్‌షిప్‌ను నిర్మించారు. నిరుపేదప్రజల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఈరోజు కేసీఆర్ ఇళ్లను ప్రారంభించనున్నారు. ఆయన చేతులమీదుగా ఆరుగురు లబ్దిదారులకు ఆయన పట్టాలు అందజేస్తారు. అరవై వేల మంది నివసించేలా ఈ కాంప్లెక్సును రూపొందించారు.

