Home Page SliderInternationalmovies

రాష్ట్ర పరువు తీసిన రుషికొండ బీచ్..

2020 నుండి ఉన్న బ్లూఫ్లాగ్ ట్యాగ్‌ను పోగొట్టుకుంది వైజాగ్‌లోని రుషికొండ బీచ్. ఈ బీచ్ వద్ద చాలా వ్యర్థాలు పేర్కొని  దుర్వాసనలు వ్యాపించాయంటూ పలువురు పర్యాటకులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర పరువు పోయిందంటూ ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. బీచ్‌ల విషయంలో డెన్మార్క్ సంస్థ బ్లూఫాగ్ ఇస్తుంది. అలాంటి బీచ్‌లే విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నీటి నాణ్యత, పరిశుభ్రత, పర్యావరణ విధానాలు, భద్రత ప్రమాణాలు పరిశీలించి డెన్మార్క్ సంస్థ ఈ బ్లూఫ్లాగ్ ట్యాగ్‌ను అందజేస్తుంది. భారత్‌లో 12 బీచ్‌లకు మాత్రమే ఈ ట్యాగ్ ఉంది.