Home Page SliderTelangana

మంత్రుల సభలో అపశ్రుతి.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలి కాప్టర్ లో వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి సమీపంలోని కలెక్టరేట్ లో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ, మంత్రుల హెలికాప్టర్ ను పైలట్ అనూహ్యంగా సభాప్రాంగణంలోనే దించేశాడు. దీంతో భారీగా దుమ్ము ఎగిసిపడింది. ఈ పరిణామంతో సభకు హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. అయితే.. సభ కోసం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.