గోవింద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్
నటుడు గోవింద బుల్లెట్ గాయం తగిలి తిరిగి కోలుకుని ఆసుపత్రి నుండి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఒక రోజు క్రితం, అతని భార్య సునీతా అహుజా నటుడి ఆరోగ్య అప్‌డేట్స్‌ని షేర్ చేశారు. ముంబైలోని జుహులోని ఆసుపత్రి బయట నుండి మీడియాతో మాట్లాడిన ఆమె, గోవిందా కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని షేర్ చేశారు. అందరి దీవెనలతో, అభిమానులందరి ఆశీస్సులతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. మేము అతని కోసం ప్రతిచోటా ప్రార్థిస్తున్నాం. కొన్ని నెలల తర్వాత మళ్లీ డ్యాన్స్ చేయనున్నాడు. ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాక్స్.