ఆస్కార్‌లో భారత్‌కు నిరాశ..
ఈసారి భారత్‌కు ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఆశించిన సినీ ప్రియులకు నిరాశ ఎదురయ్యింది. బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ చిత్రం మన దేశం నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నిన్న విడుదల చేసిన ఆస్కార్ నామినేషన్లలో షార్ట్ లిస్ట్ కాకపోవడం నిరాశ కలిగించింది. ఈ చిత్రానికి ఆస్కార్ వస్తుందని మూవీ టీమ్ ఎంతో ఆశించింది. హాలీవుడ్‌కు వెళ్లి అమిర్ ఖాన్, కిరణ్ రావులు వరుసగా ఇంటర్యూలు, స్క్రీనింగ్‌లను ఇచ్చారు. మహిళల స్వేచ్ఛ, విద్య, ఆర్థిక స్వాతంత్య్రాలకు సంబంధించిన ఈ చిత్రం తప్పకుండా ఆస్కార్ గెలుచుకుంటుందని అందరూ భావించారు.

గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గాను మ్యూజిక్ డైరక్టర్ కీరవాణికి, రచయిత చంద్రబోస్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి భారతీయ నటి షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు ఎంపిక అయ్యింది. ఈ హిందీ చిత్రం యూకే నుండి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సంపాదించింది. దీనితో షహానాకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.