డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇడుపు కాయితం పంచాయతీ..
పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్. ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తరుణ్ భాస్కర్-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ప్రొడక్షన్ నంబర్ 2.
పెళ్లిచూపులుతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ మొదలుపెట్టిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్, బూసమ్ జగన్ మోహన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ల రోజువారీ జీవితాల్లో జరిగే మనస్సును కదిలించే బావోద్వేగ సన్నివేశాలతో వినోదాన్ని అందించే యూనిక్ కథాంశంతో సినిమా ఉండబోతుందట. శ్రీనివాస్ గౌడ్-శ్రీలత విడాకుల పంచాయతీకి సంబంధించిన స్టాంప్ పేపర్‌తో డిజైన్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
12-12-2024 బేస్తారం (గురువారం) రోజున శ్రీలతకు, శ్రీనివాస్‌గౌడ్‌కు ఇడుపు కాయితం పంచాయతీ జరుగుతోంది. పంచాయతీ పెద్దలుగా, సాక్షులుగా, కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావలెను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి అని కాస్టింగ్ కాల్ అప్‌డేట్ రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్ టీం.