Andhra PradeshHome Page Slider

జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌

ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ గుర్భీర్‌పాల్‌ సింగ్‌ ఈరోజు అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసారు. ఈ సందర్భంగా ఏపీలో ఎన్‌సీసీ సేవలను మరింత విస్తరిస్తామని, ప్రత్యేకంగా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ కూడా ఏర్పాటుచేయబోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. వారికి  ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని  సీఎం హామీ ఇచ్చారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణీ మోహన్, ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఏపీ, తెలంగాణ) ఎయిర్‌ కమాండర్‌ పి.మహేశ్వర్, కల్నల్‌లు  వి.వి.శ్రీనివాస్, వివేక్‌ షీల్, స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిషి రాజ్‌ సింగ్, లైసన్‌ ఆఫీసర్స్‌ వి.సత్యం, పి.శ్రీనివాసరావు కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసారు.