పాక్‌పై దౌత్య చర్యలు..కాంగ్రెస్ నేత శశిథరూర్‌కి కీలక బాధ్యతలు
పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలకు భారత్ సిద్ధమయ్యింది. పాక్ కుట్రలను ప్రపంచదేశాల ముందు ఎండగట్టేందుకు పలు భారత ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బృందాలకు నేతృత్వం వహించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. వీరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలను సందర్శిస్తారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరిస్తారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, ఆపరేషన్ చేపట్టిన పద్దతి, పాక్ పౌరులకు హానికలగలేదనే స్పష్టత, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాక్ పాత్ర వంటి అంశాలు కీలకంగా ఆధారాలతో సహా సేకరించారు. వీటిని వివరించనున్నారు. ఈ బృందంలో శశిథరూర్-కాంగ్రెస్ , రవిశంకర్ ప్రసాద్, బెజయంత్ పాండా – బీజేపీ, సంజయ్ కుమార్-జేడీయూ, కనిమొళి- డీఎంకే, సుప్రియా సూలే-ఎన్సీపీ-ఎస్పీ, శిందే- శివసేన ఉన్నారు. వీరు విదేశాలలోని భారత్ బృందాలకు నాయకత్వం వహిస్తారు.