దిండిగల్ జిల్లాలో విషాదం
తమిళనాడు దిండిగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బైక్‌ను బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో బస్సులో నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బస్సులో ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో బస్సులో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అంతే కాకుండా ఫైర్ ఇంజన్ వచ్చే లోపే బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో దిండిగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.