దిల్ రాజు తల్లికి అనారోగ్యం
గత మూడు రోజులుగా సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ సమయంలోనే దిల్ రాజు తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రాగా, ఆమెను ఐటీ శాఖ వాహనంలోనే తీసుకువెళ్లారు. కుటుంబసభ్యులతో పాటు మహిళా అధికారిని కూడా వెంట పంపినట్లు సమాచారం.