శివసేన(యూబీటీ), కాంగ్రెస్ ల మధ్య విభేదాలు
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటిమిలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. విదర్భలోని సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ మిత్రపక్ష మైన శివసేన(యూబీటీ) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఆసక్తి చూపించటం లేదు. అయితే.. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా విదర్భలోనే 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. విదర్భలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.