విద్యుదాఘాతంతో కొత్త పెళ్లి కుమారుడు మృతి
ఓ పెళ్లి ఇంటిలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తగిలి కొత్త పెళ్లి కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో జరిగింది. విద్యుదాఘాతంలో కొత్త పెళ్లి కుమారుడు ఇస్లావత్ నరేశ్ మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం కృష్ణాజిల్లా కంకిపాడులో వివాహం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

