ఆలివ్ ఆయిల్ వల్ల బోలెడు ఉపయోగాలున్నాయో తెలుసా?
నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్ కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతి బొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ల్లో ఉండే ఒలి యోకాంతల్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాలు, రక్తంలో చక్కెర స్థాయిలను, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం రోజూ రెండు టేబుల్ స్పూన్లు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఖాళీ కడుపుతో ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు దారి తీసే కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది ఎక్కువ కాలం జీవించే అవకాశాలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.