వీళ్ల దుంపతెగ…మరీ అంతలా తాగేశారా!
ఏపి,తెలంగాణాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు మనోళ్లు ఒకే ఒక్క రోజు దాదాపు రూ.1000కోట్ల మద్యాన్ని తాగేశారు.ఏపిలో రూ.339 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగగా, తెలంగాణలో రూ.640కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓ వెయ్యి అటూ ఇటూగా వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగడం ఇదే ప్రధమమని తెలుస్తుంది.అయితే ఏపి తాగుబోతులు కూడా తెలంగాణ మద్యంపైనే మక్కువ పెంచుకున్నట్లు తెలుస్తుంది. ఏపి కంటే తెలంగాణ లిక్కర్ సేల్స్ అధిక విక్రయాలను బట్టి చూస్తుంటే ఏపిలో మొన్నటి దాకా పిచ్చెక్కించిన బూం బూం బీర్లు,స్పెషల్ స్టేటస్ మందు బాటిళ్లే గుర్తొచ్చుంటాయనిపిస్తుంది. అందుకే కాబోలు ఏపిలో మందుబాబులంతా తమ తమ న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ లిక్కర్ తో జరుపుకున్నారు.