కన్నవాళ్లకు ఏనాడైనా అన్నం ముద్ద పెట్టావా చంద్రబాబు?
ఏపిసీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు ని ప్రశ్నలతో వైట్ వాష్ చేశారు.” నీకూ కుటుంబం ఉంది.ఏనాడైనా నీ కన్న వాళ్లను ఈ రాష్ట్ర ప్రజలకు చూపావా? వాళ్లని పిలిచి ఇంత అన్నం ముద్ద పెట్టావా? వాళ్లు చనిపోతే కర్మకాండలు చేశావా? నీ బావమరిది బాలకృష్ణ నా చెల్లి షర్మిలపై తప్పుడు ప్రచారం చేయలేదా? నా చెల్లి,తల్లిపై అసభ్యకర పోస్టులు పెట్టించావ్. ఐటిడిపి పేరుతో సోషల్ మీడియాలో అనరాని మాటలు అన్నారు. మా కుటుంబంలో విభేదాలున్న మాట వాస్తవమే.నా చెల్లి,తల్లితో రాజకీయం చేయడం ఏంటి? ” అంటూ జగన్ తూర్పారబట్టారు. చంద్రబాబు ఎప్పటికీ మారని మనిషని, అసత్యాలు తప్ప సత్యమెరుగడని ఎద్దేవా చేశారు.

