‘లాస్ట్ ఓవర్ ధోనీ మ్యాజిక్’..అయినా ఓటమి..
కెప్టెన్ కూల్ ధోనీ నిన్నటి ఆర్సీబీ, సీఎస్‌కే పోరులో కూడా అద్భుతమైన మ్యాజిక్ చేశారు. 9వ స్థానంలో క్రీజ్‌లో వచ్చిన ధోనీ 16 బంతుల్లో మూడు ఫోర్సు, రెండు సిక్స్‌లతో విధ్వంసం సృష్టించి, నాటౌట్‌గా నిలిచారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలయ్యింది. దీనికి కారణం ధోనీని 9వ స్థానంలో మైదానంలో దింపడమే అని అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు బౌలర్ల దెబ్బకు 13 ఓవర్లలోపే 80 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది చెన్నై. అప్పుడే ధోనీని దింపి ఉంటే బెంగళూరు ఉంచిన 197 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేరుకుని ఉండొచ్చని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అభిప్రాయపడ్డారు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ తొమ్మిదో స్థానంలో రావడం సరైన నిర్ణయం కాదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ.. లాస్ట్ ఓవర్ ధోనీ సూపర్ హిట్స్’ అంటూ ఐపీఎల్ ఇన్‌స్టాలో వీడియో రిలీజ్ చేసింది.