టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచిన ధోనీ
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, టెన్నిస్ ఆటల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ధోనికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో ప్రతి ఏటా జేఎస్ సీఏ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఏటా ఓ టెన్నిస్ ప్లేయర్ హోదాలో ధోనీ పాలుపంచుకుంటున్నాడు. ఈ ఏడాది నిర్వహించిన టోర్నీలో ఏకంగా విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకుల నుంచి అతడు ట్రోఫీని అందుకున్నాడు. మరో విశేషమేమిటంటే ఇప్పటికే రెండు సార్లు ధోనీ విజేతగా నిలిచాడు. తాజా విజయంతో అతడు వరుసబెట్టి మూడేళ్లపాటు 3 టైటిళ్లను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.