“ధోని బాగా ఆడాలంట..కానీ ముంబై గెలవాంట”
దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ప్రస్తుతం IPL వీక్షించడంలో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్ IPL మ్యాచ్‌లు అంత ఉత్కంఠగా సాగుతున్నాయి. అది ఎంతలా అంటే అంచనాలన్నీ తలక్రిందులయ్యేలా అనే చెప్పాలి. ఈ సీజన్‌లో భారీ అంచనాలతో ఆట మొదలు పెట్టిన వాళ్లు ఎవ్వరు ఊహించని విధంగా ఓటమి పాలవుతుంటే..అంచనాలేవి లేకుండా ఆట ప్రారంభించిన వారు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో MI Vs CSK తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే దీనికి ఆయన వింతగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ధోని బాగా ఆడి వినోదం పంచాలనుకుంటున్నారన్నారు. కాగా వారు ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకుంటున్నారని ఇర్ఫాన్ తెలిపారు. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..మహ్మద్ కైఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అంతేకాకుండా సొంత గడ్డపై ముంబై బలం రెట్టింపు అవుతుందని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. అయితే చైన్నె సూపర్ కింగ్స్‌ను ఓడించాలంటే మాత్రం ముంబై జట్టు కష్టపడాల్సిందేనని కైఫ్ వెల్లడించారు.