Home Page SliderNational

“ధోని ఈజ్ బ్యాక్”

ఈ IPL సీజన్‌లో CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నారని ఆ టీమ్ కోచ్ ఫ్లెమింగ్ ఇప్పటికే వెల్లడించారు. అంతేకాకుండా ఈ గాయం నుంచి త్వరగా కోలుకోని తర్వాత జరగబోయే మ్యాచ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. దీంతో ధోని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ధోని చాలా త్వరగానే గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా తయారైనట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ బెంగుళూరుతో జరగనున్న మ్యాచ్ కోసం ధోని స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ వీడియోను IPL యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఫ్యాన్స్ ట్వీట్ చేస్తూ..”తలా ఈజ్ బ్యాక్” అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే RCB VS CSK మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సివుంది.