చివరి ఓవర్లో చితకొట్టిన ధోని
ప్రస్తుతం దేశంలో IPL మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రతి జట్టు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినీషర్‌గా పేరున్న ధోని.. IPLలోనూ దానిని కొనసాగిస్తున్నారు. కాగా కెప్టెన్ కూల్ ధోని 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్‌గా అగ్రస్థానంలో నిలిచారు. కాగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(33),రవీంద్ర జడేజా(26),హార్థిక్ పాండ్యా(25),రోహిత్ శర్మ(23) ఉన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ధోని రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ అధిగమించే అవకాశం లేదు అన్నట్లు కన్పిస్తోంది.