ఈషా డియోల్‌కు పెళ్లిచేసి పంపుదామనుకున్న ధర్మేంద్ర
ఈషా డియోల్‌కు తండ్రి ధర్మేంద్ర యాక్టింగ్ వైపుకి రాకుండా “18 ఏళ్ళ వయసులో గృహిణిగా” చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. “అతను పంజాబీ అయినందున అతను సరిగ్గా అటువంటి సెంటిమెంట్లు గల వ్యక్తి” అని ఇషా డియోల్ చెప్పారు. ధూమ్ నటి ఈషా డియోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి ధర్మేంద్ర తనను సినిమాల్లోకి రాకుండా 18 ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అవి అతని కండిషన్స్, అతనివి అటువంటి ఆలోచనలే, ఆ ఆలోచనల నుండి ఎదగకుండా ఉండిపోయారు. అతని కుటుంబంలోని స్త్రీలు కూడా అంతా అలా పెరిగినవారే. కానీ, మా ఇంట్లో నా పెంపకం చాలా భిన్నంగా ఉంది, మా అమ్మ సినిమాల్లో నటించడం, ఆమె నృత్యం పట్ల నాకు ఇష్టం ఏర్పడడం, నాలో ఒక ఐడియాని క్రియేట్ చేసింది. నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పేలోపల, అది చెప్పలేక అలానే ఉండిపోయాను. అతన్ని ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది, అది అంత సులభం కాదు, కానీ, ఈ రోజు వేరే కథగా మారింది, అని ఆమె చెప్పింది.
ఈషా డియోల్ హేమామాలిని, ధర్మేంద్రల కుమార్తె, మరో కుమార్తె అహానా డియోల్. వ్యక్తిగత విషయానికి వస్తే, ఫిబ్రవరిలో, ఈషా డియోల్, ఆమె భర్త, వ్యాపారవేత్త భరత్ తఖ్తానీ విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారు ఒక కామన్ ఒప్పంద పత్రం ద్వారా తెలిపారు. “మేము అండర్‌స్టాంగింగ్‌తోనే, ఫ్రెండ్స్‌గానే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈషా డియోల్ లాస్ట్‌టైమ్ హంటర్ సినిమాలో కనిపించింది. టూటేగా నహీ తోడేగా షోలో సునీల్ శెట్టి, బర్ఖా బిష్త్‌లతో కలిసి కనిపించింది.

