Home Page SliderNational

తెలంగాణలో ధరణి-ఆంధ్రలో ల్యాండ్ టైటలింగ్  ప్రభుత్వాలను కూల్చేసాయా..

తెలంగాణలో ధరణి-ఆంధ్రలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్  ప్రభుత్వాలను కూల్చేసాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. జగనన్న భూరక్షణ పథకం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, భూముల్లో బండలు వేసి, పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మవేసి, హడావిడిగా వందల కోట్లు ఖర్చు పెట్టారని కానీ ఈపుస్తకాల వల్ల భూమి పొందిన రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఈ జగన్ బొమ్మ ఉండే పాస్ పుస్తకాలలోనే దీనిపై బ్యాంకు లోన్ రాదు, రిజిస్ట్రేషన్‌కు కూడా పనికిరాదని వ్రాసి ఉందని, మరి ఈ పుస్తకాలను ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. ఒకే సర్వే నెంబర్లతో ముగ్గురికి కేటాయించారని, దీనితో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వ  చిహ్నంతో పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించాయని పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో ధరణిలో కూడా ఇలాంటి అవకతవకల వల్లే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. జగన్ భూ రక్షణ పథకానికి పాతరేసిన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందనలు తెలియ జేశారు