Home Page SliderNational

“కుబేర” సినిమాలో ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం రాయన్ థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ రోజు అతని పుట్టినరోజు సందర్భంగా కుబేర మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. పోస్టర్‌లో ధనుష్ లుక్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. అభిమానులకి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కుబేర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తుండగా, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున జిమ్ సర్భ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.