Breaking NewsHome Page SliderInternationalSports

ధ‌నాధ‌న్ క్రికెట‌ర్ అత‌నే…!

శ్రీలంక యువ బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2024లో అన్ని ఫార్మాట్లలో మొత్తం 34 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను దాదాపు 50 సగటుతో 1458 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, చాలా అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తంగా 148 ఫోర్లు, 33 సిక్సర్లు బాద‌డం కూడా ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడంలో కీల‌క పాత్ర పోషించాయి. 2024 సంవత్సరానికి గాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. దీంతో అత‌ను స‌ర్ డాన్ బ్రాడ్‌మాన్ ప్రపంచ రికార్డును సమం చేసిన‌ట్లైంది.