కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ వ్యాఖ్యలు
కానిస్టేబుళ్లు ఆందోళనలు చేయడం సరైనది కాదని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. సెలవులపై పాత పద్దతినే అమలు చేస్తామని నచ్చచెప్పినా వారు వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. వీటి వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రిక్రూట్ మెంట్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.