ఐపీఎస్‌లకు డీజీపీ తిరుమలరావు మెమోలు జారీ..
ఎపీ: వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. జాషువా, అమ్మిరెడ్డి, విశాల్ గున్ని, రిశాంత్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్, విజయరావు, కాంతిరాణా టాటా మొదలైనవారు ఈ జాబితాలో ఉన్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెడ్‌క్వార్టర్స్‌లోనే పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు.