Andhra PradeshHome Page Slider

సెలవులో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఇన్ఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

సెలవులో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి
ఇన్ఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి సెలవులో వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనకు వెళ్లినందున ఈ నెల 18 నుంచి జూన్ 3 వరకూ 16 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులు (ఈఎల్) మంజూరు చేసింది. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీకి, ఏసీబీ డైరెక్టర్ జనరల్, ఇన్ఛార్జి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాజేంద్రనాధ్ రెడ్డి తిరిగి వచ్చాక ఆయన యథాస్థానంలో కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్రెడ్డి ఉత్తర్వులిచ్చారు.