పోలీసుల ఆందోళనపై డీజీపీ సీరియస్
తెలంగాణలో బెటాలియన్ పోలీసులు ఆందోళనపై డీజీపీ జితేందర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. సెలవులపై పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఆందోళనలు కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ రిక్రూట్ మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

