‘భైశాఖీ’ సందర్భంగా గంగా స్నానానికి పోటెత్తిన భక్తులు
ఉత్తరభారతీయులకు ముఖ్యపండుగ భైశాఖీ. సిక్కుల నూతన సంవత్సరంగా పిలువబడే ఈ పర్వదినం నాడు గంగా స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంలో హరిద్వార్‌లోని గంగాస్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈ పవిత్రస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలోని సరోవరంలో కూడా సిక్కులు పవిత్రస్నానాలు ఆచరించారు. సిక్కులు వారి పదవగురువైన గురుగోవిందసింగ్‌ను ప్రార్థనలు చేసుకుంటారు. 1699 నుండి గురుగోవింద్‌సింగ్ ఖల్సా స్థాపనకు గుర్తుగా జరుపుకుంటారు. పంజాబీ హిందువులు కూడా వారి నూతన సంవత్సరవేడుకగా ఈ పండుగను జరుపుకుంటారు.


