డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన 13 మంది కొత్తగా చేరిన బీజేపీ అభ్యర్థులను కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని, ప్రతి గ్రామంలో ఉపాధి పథకం నిధులు, ప్రధానమంత్రి సడక్ యోజన నిధులతోనే అభివృద్ధి జరిగిందన్నారు. కొందరు చెప్పే మాయమాటలు కామారెడ్డి ప్రజలు నమ్మరని, డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

