అభివృద్ధి సాధ్యమనేది ఒక్క బీజేపీతోనే
వర్ధన్నపేట: పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. గురువారం వర్ధన్నపేటలోని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బీజేపీతోనే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి వస్తే ఆదివాసీలు, గిరిజనులు, రైతులు, యువత, మహిళలకు మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా.. ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెడుతోందని విమర్శించారు. ప్రజలారా బీజేపీకి తమయొక్క ఓటు కమలం గుర్తుపై వేసి డబుల్ ఇంజిన్ సర్కార్‌కు జై పలకండి.

