Home Page SliderTelangana

అభివృద్ధి మీ చేతుల్లో.. ఓటు ద్వారా ముందుచూపుతో మెలగండి

పెద్దపల్లి: గోదావరిఖనిలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం మైంది, బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపిన సీఎం కేసీఆర్. ప్రచారంలో తలమునకలైన కార్యకర్తలు.. నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారా మరోసారి దిశానిర్దేశం చేశారు. గులాబీ శ్రేణుల్లోఉత్సాహం నింపారు. కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేసీఆర్ సభికులను, ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన చందర్ రెండు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు.