Home Page SliderInternational

“దేవర చిత్రం మామూలు హీరో-విలన్ చిత్రం కాదు”.. డైరక్టర్

 ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తాజా చిత్రం ‘దేవర’ మామూలుగా వచ్చే సాధారణ హీరో- విలన్ చిత్రం కాదు. 1980-1990 మధ్యకాలంలో ఈ కథ జరిగే కథ అని డైరక్టర్ కొరటాల శివ పేర్కొన్నారు. అలాగే ఇది రెగ్యులర్ చిత్రం కాదన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే సంఘటనల గురించి, వారి రిలేషన్ల గురించే ఈ చిత్రం ఉంటుందని డైరక్టర్ పేర్కొన్నారు.

ఇది యాక్షన్ డ్రామా చిత్రం అని హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కొన్ని విశేషాలు, సస్పెన్సులు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని ఎన్టీఆర్ ఆశపడుతున్నారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి అమెరికాలో ముందస్తు బుకింగుల విషయంలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.