Home Page SliderNational

మాస్ యాక్షన్ సీన్స్‌తోనే దేవర పాత్ర తెరపైకి..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా చిత్రం రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే, దేవర సెట్స్‌లో ఆయుధపూజ జరుగుతోంది అంటూ చిత్రబృందం పవర్‌ఫుల్‌గా జూ.ఎన్‌టిఆర్ చేతిలో పట్టుకున్న ఓ కొడవలి కత్తిని రివీల్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఈ కత్తి నేపథ్యంలోనే యాక్షన్ సీక్వెన్స్‌ను పిక్చరైజ్ చేస్తున్నారు. పైగా ఈ సీక్వెన్స్‌లోనే ఎన్టీఆర్ రెండో పాత్ర రివీల్ కాబోతోంది. ఈ పాత్ర ఎలివేషన్ ఓ సెన్సేషనల్  రేంజ్‌లో ఉంటుందని.. ముఖ్యంగా తారక్ కత్తి పట్టి నరుక్కుంటూ వెళ్లే షాట్స్ చాలా వైల్డ్‌గా, బీభత్స వాతావరణంలో అద్భుతమైన విజువల్‌గా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన ఈ కొడవలి కత్తితో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మొత్తం మీద దేవర సినిమాపై రోజు రోజుకూ అంచనాలు బారీగా పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.