అల్లు అర్జున్ ఇంటికి దేవరకొండ బ్రదర్స్..
జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ తో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అరవింద్ కు విష్ చేయగా.. విజయ్ ను అరవింద్ అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతున్న అల్లు అర్జున్ కాల్ ముగించి విజయ్ తో షేక్ హ్యాండ్ ఇస్తూ హత్తుకున్నారు. విజయ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

