చరిత్ర సృష్టించిన ‘దేవర’..దేశంలో ఇదే రికార్డు
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ చిత్రం అరుదైన రికార్డు సాధించింది. దేశంలోనే ప్రీ టికెట్ల సేల్‌లో రికార్డు అమ్మకాలు సాధించి, వన్ మిలియన్ డాలర్లు సాధించింది. ఈ చిత్రం ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకపోవడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు పాటలు ఇప్పటివరకూ విడుదల కాగా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు సొంతం చేసుకుంది. ఇదే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రం. ట్రైలర్ రిలీజ్ అయితే మరింత రికార్డులు సాధిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు సంబరపడుతున్నారు. మరోపక్క ప్రమోషన్లతో మూవీ టీం అభిమానులను అలరిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మొదటిసారి తెలుగులో నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.

