Home Page SliderInternational

దేవర ట్రైలర్ అదుర్స్

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమా అంచనాలను పెంచేస్తోంది. నేడు తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ హీరోయిజం, జాన్వీ లుక్స్ కట్టిపడేశాయంటున్నారు ప్రేక్షకులు. అనిరుధ్ మ్యూజిక్ అదరగొట్టగా, సైఫ్ విలనిజం ఆకట్టుకుంది. ఈ నెల 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు సొంతం చేసుకుంది. ఇదే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా పేరుపొందింది. అరుదైన రికార్డు సాధించింది.