లవ్ సాంగ్ కోసం ‘దేవర’ కొత్త స్టెప్పులు?
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలోని బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్‌ను టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ను కూడా వేసినట్లు తెలుస్తోంది. అన్నట్టు, ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మ్యూజికల్ స్టెప్స్‌తో పాటు ‘ఎన్టీఆర్ – జాన్వీ కపూర్’ల లవ్ జర్నీని కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తారట.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

