Home Page SliderNational

‘దేవర షూటింగ్ ప్రాణాంతకంగా మారింది’..ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..

‘దేవర’ చిత్రం షూటింగ్ సమయంలో ఒకసారి తనకు తీవ్ర ఆందోళన కలిగిందని, ప్రాణాంతకంగా మారిందని వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్. దేవర చిత్రం షూటింగ్ గోవాలో జరిగినప్పుడు చాలా కష్టంగా అనిపించిందని ఒక ఇంటర్యూలో పేర్కొన్నారు. సముద్రంలో సీన్ చేస్తున్నప్పుడు చాలా ఎండగా ఉందని, సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నట్లు అనిపించిందన్నారు. ఒక్క క్షణం చనిపోతానేమో అని భయపడి, భార్యాపిల్లలు గుర్తొచ్చారని పేర్కొన్నారు. షాట్ అయిపోగానే అక్కడ నుండి పరిగెత్తి వెంటనే ఏసీ రూమ్‌లో పడుకున్నానని, అయితే తన దురదృష్టం కొద్దీ అప్పుడే కరెంట్ పోయిందని అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్.